JC Prabhakar Reddy media conference: తాడిపత్రి డీఎస్పీ చైతన్య క్యారెక్టర్ లేనివాడంటూ టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. మీడియా సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ వరష్టు అని అనంతపురం డీఐజీ రవిప్రకాశ్ తనిఖీలో గుర్తించటంపై అభినందించారు. రాష్ట్రంలో వాస్తవాలను చెప్పిన పోలీసు అధికారి డీఐజీ రవిప్రకాష్ మాత్రమేనని జేసీ అన్నారు. తాడిపత్రి డీఎస్పీ అరాచకాలపై తాను ఎన్నిసార్లు చెప్పినా అమరావతి నుంచి అనంతపురం వరకు ఏ అధికారి పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మట్కా, గుట్కా,గంజాయి, ఇసుక, క్రికెట్ బెట్టింగులపై ఎమ్మెల్యేతో కలిసి భాగస్వామిగా ఉన్నాడంటూ డీఎస్పీ చైతన్యపై ఆరోపణలు చేశారు.
తాడిపత్రి డీఎస్పీ చైతన్య క్యారెక్టర్ లేని వ్యక్తి .. జేసీ ప్రభాకర్ రెడ్డి - Tadipatri Latest News
JC Prabhakar Reddy media conference: టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి డీఎస్పీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం నిర్వహించిన జేసీ డీఎస్పీపై విరుచుకుపడ్డారు. ఓ మహిళపై కక్షకట్టి 307 సెక్షన్ కింద కేసుపెట్టి లోపలపెట్టిన క్యారెక్టర్ లేని వ్యక్తి డీఎస్పీ చైతన్య అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ పరిస్థితిపై డీఐజీ రవిప్రకాష్ స్వయంగా తనిఖీచేసి వాస్తవాలు చెప్పటంపై తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఓ మహిళపై కక్షకట్టి 307 సెక్షన్ కింద కేసుపెట్టి లోపలపెట్టిన క్యారెక్టర్ లేని వ్యక్తి డీఎస్పీ చైతన్య అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడిపత్రిలో గొలుసులు దోపిడీకి గురైన వారి సొత్తును రికవరీ చేయటంలేదని, సొమ్ము పోగొట్టుకున్న బాధితులు రోజూ చాలామంది పోలీసుల చుట్టూ తిరుగుతున్నారని, దొంగసొమ్ములో కూడా డీఎస్పీకి భాగం ఉందేమో అన్నారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ పరిస్థితిపై డీఐజీ రవిప్రకష్ స్వయంగా తనీఖీచేసి వాస్తవాలు చెప్పటంపై తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి: