ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారు: ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి - mlc deepak reddy comments on ycp leaders

వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో దాడులు చేసి గెలవాలని.. వైకాపా నేతలు అనుకుంటున్నారని మండిపడ్డారు.

mlc deepak reddy
ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి

By

Published : Mar 10, 2021, 3:02 PM IST


వైకాపా నేతలు ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సమావేశమైన దీపక్ రెడ్డి వైకాపా.. తీరును విమర్శించారు. దాడులు చేసి ఎన్నికలలో వైకాపా నేతలు గెలవాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో నిలిచిపోయేలా ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించి మమ అనిపించిందని ఎద్దేవా చేశారు.. నాయుడుపేటలో దళిత తెదేపా అభ్యర్తి పచ్చ చొక్కా వేసుకున్నారని నడి రోడ్డుపై చొక్కా విప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details