ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభివృద్ధి మానేసి రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ పడుతున్నారు' - ananthapuram district elections

పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం వేడెక్కుతోంది. ప్రచారంలో ప్రతిపక్ష, అధికార పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవకి దేవి తరఫున తెదేపా నేత పయ్యావుల కేశవ్ ప్రచారంలో పాల్గొన్నారు.

tdp mla payyavula keshav attend in election campaigning in uravakonda ananthapuram district
తెదేపా నేత పయ్యావుల కేశవ్

By

Published : Feb 15, 2021, 3:12 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ సర్పంచ్ అభ్యర్థి దేవకి దేవి తరఫున తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. విద్యావంతురాలైన దేవకి దేవిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

అభివృద్ధి చేయడాన్ని వైకాపా నాయకులు మానేసి... రియల్ ఎస్టేట్ రంగంలో పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తే... అవి నకిలీ ఇంటి పట్టాలంటూ విశ్వేశ్వరరెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

ఇదీచదవండి.

అక్కడ ఓట్లు అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: కొడాలి నాని

ABOUT THE AUTHOR

...view details