ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపోయిన నేతన్నలను, రైతులను ఆదుకోండి: ఎమ్మెల్యే పయ్యావుల

అనంతపురం జిల్లాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను, నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు.

mla payyavula kesav
ఎమ్మెల్యే పయ్యావుల

By

Published : Oct 12, 2020, 10:26 AM IST

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను, చేనేత కార్మికులతో పాటు గృహాలు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని పీఏసీ చైర్మన్ ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ వర్షాలు నియోజకవర్గంలోని వేరుశనగ, మిరప, పత్తి, అరటి రైతులకు తీవ్ర ఆవేదనను మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కుండపోత వర్షాలకు చేనేత కార్మికలు మగ్గాలు తడిసి, వాటి పరికరాలు పూర్తిగా పాడయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. వీరందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారులు నియోజకవర్గంలో పర్యటించి... ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్టు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details