అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏడో వార్డులో బుధవారం తెదేపా పోలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైకాపా నాయకులు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రచారం - Municipal Elections in Anantapuram
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు
మున్సిపల్ ఎన్నికలు: రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రచారం
రాయదుర్గం పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇంటింటికి కరపత్రాలు పంచి.. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు.
ఇవీ చదవండి
కుక్కను తప్పించబోయి.. ఓ వ్యక్తి మృతి
TAGGED:
అనంతపురం జిల్లా తాజా వార్తలు