ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులైన చేనేతలకు నేతన్న నేస్తం అందించాలి' - కల్యాణదుర్గం తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు వార్తలు

అర్హులైన చేనేతలను నేతన్న నేస్తం పథకం జాబితాలో నుంచి తీసేశారని .. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. దీనిపై ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. వారందరికీ న్యాయం చేయాలని కోరారు.

tdp memorandum to mpdo on nethanna nestham in kalyanadurgam ananthapuram district
ఎంపీడీవోకు వినతిపత్రం అందిస్తున్న తెదేపా నేతలు

By

Published : Jun 27, 2020, 10:14 PM IST

అర్హులైన చేనేతలకు నేతన్న నేస్తం పథకం అందించాలని.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. బ్రహ్మసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవని ఆరోపించారు. దీనిపై ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

స్థానిక నాయకులతో కలిసి ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. అర్హులైన ప్రతిఒక్కరికి పథకం వర్తింపజేయాలని.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని ఉమామహేశ్వర నాయుడు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details