ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులకు కాదు... అనర్హులకే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు'

రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ అనంతపురం జిల్లా నార్పలలోని తెదేపా నేతలు మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలు అర్హులైన పేదలకు కాకుండా... అనర్హులైన వారికే పట్టాలిచ్చారని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్.ఎస్. రాజు ఆరోపించారు.

tdp members said  Homes for all the poor(pedhalandhariki illu scheem) scheem are being manipulated in ananthapuram district
tdp members said Homes for all the poor(pedhalandhariki illu scheem) scheem are being manipulated in ananthapuram district

By

Published : Jun 4, 2020, 7:24 PM IST

అనంతపురం జిల్లా నార్పల మండలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జాబితాలో అవకతవకలు జరిగాయని తెదేపా నేతలు ఆరోపించారు. అర్హులైన పేదలకు కాకుండా అనర్హులకే 90% శాతం పట్టాలిచ్చారని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్.ఎస్. రాజు ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు.... తమ కార్యకర్తలకే ఇళ్ల స్థలాలిస్తూ... జాబితా తయారు చేశారంటూ.. కార్పొరేషన్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరుకూ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు... ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారే తప్పా... క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details