వ్యవసాయ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఆనాడు రాజ్యసభలో తెదేపా చర్చించిందని.. మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కోరుతూ.. తెదేపా నేతలు అనంతపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చట్టాలను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఇష్టం మేరకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను ఆనాడే ప్రస్తావించినా... కేంద్రం పెడచెవిన పెట్టిందని గుర్తు చేశారు. రైతుపై పెత్తనం చెలాయించే బిల్లును ఉపసంహరించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి మార్పులు చేయాలని కోరారు.
'రైతుల ఇష్టం మేరకు చట్టాల్లో సవరణలు చేయాలి' - Anantapur District Latest News
రైతుల ఇష్టం మేరకు చట్టాల్లో సవరణలు చేయాలని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెదేపా నేతల బృందం అనంతపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించింది.
'రైతుల ఇష్టం మేరకు చట్టాల్లో సవరణలు చేయాలి'