ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PROTEST: చెరువు ప్రాంతాన్ని కబ్జా చేస్తున్నారు.. : తెదేపా నాయకుల ఆందోళన - అనంతపురం జిల్లా తాజా వార్తలు

PROTEST: కళ్యాణదుర్గం శివారులోని 93 ఎకరాల చెరువు ప్రాంతాన్ని పూడ్చి కొంతమంది అధికార పార్టీ నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై అధికారులు స్పందించకపోతే తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని నియోజకవర్గ ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు స్పష్టం చేశారు.

PROTEST
చెరువు ప్రాంతాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని.. తెదేపా నాయకుల ఆందోళన

By

Published : May 23, 2022, 2:17 PM IST

PROTEST: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని 93 ఎకరాల చెరువు ప్రాంతాన్ని పూడ్చి కబ్జాకు పాల్పడుతున్నారని తెదేపా నాయకులు నిన్న సాయంత్రం నుంచి ఆందోళన చేపట్టారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట చెరువును కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమంగా పట్టా పొంది లే అవుట్​లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గ ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

ఈ విషయంపై అధికారులు ఎవరు స్పందించకపోవడంతో రాత్రి కూడా చెరువు పూడ్చిన ప్రాంతంలోనే వంటావార్పు నిర్వహించి ధర్నా చేశారు. ధర్నా కొనసాగుతుండటంతో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తేదేపా శ్రేణులు భారీగా చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది రైతులకు ఈ చెరువు ఉపయోగపడుతుందని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించకపోతే తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details