ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహనిర్బంధం చేయడంపై... అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... ఎమ్మెల్సీ తిప్పేస్వామి, తెదేపా నేతలను ఠాణాకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల, నాయకుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. వెనక్కి తగ్గని పోలీసులు తిప్పేస్వామిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
'తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం' - Police Arrests
తెదేపా అధినేత చంద్రబాబును గృహనిర్బంధం చేసినందుకు నిరసనగా... అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి... తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తెదేపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం