ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా​ ప్రభుత్వ ఆగడాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం' - kalyanadurgam tdp leaders dharna news

తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు.

తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గంలో నిరసన
తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గంలో నిరసన

By

Published : Jun 12, 2020, 3:38 PM IST

ప్రస్తుతం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి వాస్తవిక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన పేర్కొన్నారు. తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్ట్​కు నిరసనగా కళ్యాణదుర్గం తెదేపా కార్యాలయం నుంచి నల్ల జెండాలతో స్థానిక అంబేడ్కర్​ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ ఆగడాలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి:'అన్యాయాలు, అరాచకాలు బయటపెడుతున్నందుకే అరెస్టులు'

ABOUT THE AUTHOR

...view details