తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిపై అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలను ఖండించామనే కక్షతో పోలీసులు తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని.. అనంతపురంలో తెలుగుదేశం నాయకురాళ్లు ఆరోపించారు. తమ ఇళ్లలో కార్డెన్ సెర్చ్ పేరుతో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. రౌడీల ఇళ్లల్లో చేయాల్సిన సోదాలు తమ ఇళ్లలో చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు ఇలా చేయడం సరికాదన్నారు. తీరు మార్చుకోవాలంటూ తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి స్వప్న తన ఇంటివద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
TDP PROTEST: అనంతపురంలో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య తోపులాట - అనంతపురం జిల్లా తాజా వార్తలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిపై అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలను ఖండించామనే కక్షతో పోలీసులు తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని.. అనంతపురం తెలుగుదేశం నాయకురాళ్లు ఆరోపించారు. రౌడీల ఇళ్లల్లో చేయాల్సిన సోదాలు తమ ఇళ్లలో చేయడం ఏంటని ప్రశ్నించారు.

అనంతపురంలో తెదేపా నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట
అనంతపురంలో తెదేపా నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట
Last Updated : Nov 25, 2021, 3:28 PM IST