అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని కర్ణాటక, నాగేపల్లి వద్ద గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏపీ టిడ్కో భవన సముదాయాల వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. పుట్టపర్తి పట్టణంలోని 1008 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాగా, 805 మంది సొంతింటి కోసం డీడీలు చెల్లించారని గుర్తు చేశారు. వీరిలో 407 మంది ఇళ్లను రద్దు చేశారని.. ఇది సరైన చర్య కాదని నిరసన తెలిపారు. తక్షణమే.. లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పుట్టపర్తిలో తెదేపా నేతల నిరసన - latest news of tdp protest
ఏపీ టీడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన భవన సముదాయాలను డీడీలు చెల్లించిన లబ్దిదారులకు వెంటనే కేటాయించాలని తెదేపా నాయకులు నిరసన చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన తెదేపా నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
tdp leaders protest in anantapur dst