ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు.. గుంతల రోడ్లు, గోతుల రోడ్లు'.. తెదేపా వినూత్న నిరసన - మడకశిరలో తెదేపా నేతల ధర్నా

tdp leaders protest for roads: వైకాపా ప్రభుత్వంలో రోడ్లను కనీసం పట్టించుకోవడం లేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు తెదేపా హయాంలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తే.. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా గుంతలమయంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.

tdp leaders protest for roads
tdp leaders protest for roads

By

Published : Jan 16, 2022, 4:54 PM IST

tdp leaders protest for roads: అనంతపురం జిల్లా మడకశిర పుట్టణ పరిధిలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెనుకొండ, హిందూపురం ప్రాంతాలకు వెళ్లే రోడ్ల దుస్థితిపై ఆందోళన చేశారు. తెదేపా హయాంలో వేసిన రోడ్డుపై.. చంద్రన్న కానుక అంటూ రోడ్డుపై రంగులద్దారు. గుంతలుగా ఉన్న హిందూపురం వెళ్లే రోడ్డుపై "నేడు జగనన్న కానుక" అంటూ రాసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. "నాడు రోడ్లు, నేడు గుంతలు.. ఇవేమి రోడ్లు.. ఇవేమి రోడ్లు.. గుంతల రోడ్లు, గోతుల రోడ్లు అంటూ " అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్ పై సెస్ పెంచి ప్రజల నుంచి ప్రభుత్వం డబ్బులు దోచుకుంటోందని విమర్శించారు. కనీసం రోడ్ల మరమ్మతులను చేపట్టడంలో సర్కారు విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధులు మంజూరు అంటూ బురిడీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రోడ్లు భవనాల మంత్రి ఇదే జిల్లాకు చెందినప్పటికీ.. పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సర్కార్.. రోడ్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details