గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను లబ్ధిదారులకు కేటాయించాలని అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. 'నా ఇల్లు నా సొంతం' నినాదంతో కదిరి పట్టణంలోని రోడ్లు భవనాల విశ్రాంతి భవనం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ వెంకట రెడ్డికి తెదేపా నాయకులు వినతి పత్రం అందించారు.
టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని తేదేపా నిరసన - టిడ్కో గృహాలపై తెదేపా నిరసన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు.. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా.. ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.

తెదేపా నిరసన