TDP leaders protest: రొద్దం మండలంలోని బీదానపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కొందరు గొడవపడ్డారు. ఆ గొడవ పడుతున్నవారిని సముదాయించేందుకు వెళ్లిన 13 మంది తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి.. సోమవారం స్టేషన్‌కు పిలిపించారు. ఈ విషయం తెలుసుకున్న కంబాలపల్లి గ్రామ సర్పంచ్ మంజునాథ్ సహా పలువురు తెదేపా నాయకులు స్టేషన్ వద్దకు వెళ్లారు. ఆగ్రహించిన ఎస్సై నాగస్వామి స్టేషన్లో మీకు పనేంటని లాఠీతో బయటికి తరిమేశారు. ఎస్సై తీరును నిరసిస్తూ.. తెదేపా నాయకులు రొద్దం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట తెదేపా ఆందోళన.. ఎస్సై క్షమాపణ చెప్పాలని డిమాండ్ - అనంతపురం జిల్లాలో తెదేపా నాయకుల ఆందోళన
TDP leaders protest: అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని బీదానపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్సై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే..?
TDP leaders protest: తెదేపా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత.. ఇతర నాయకులు పోలీస్టేషన్ ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పెనుకొండ సీఐ వెంకటేశ్వర్లు ఇరువర్గాలతో మాట్లాడగా.. తేదేపా సర్పంచ్ మంజునాథ్‌కు ఎస్సై నాగస్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Guntur Municipal: గుంటూరు కౌన్సిల్ సమావేశంలో గందరగోళం.. కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం