ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులకు వ్యతిరేకంగా తర్పణం వదిలిన తెదేపా నేతలు - latest news on amaravathi

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నా నదిలో తెదేపా నేతలు తర్పణం వదిలారు. రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders protest against three capitals at ananthapur
మూడు రాజధానులకు వ్యతిరేకంగా తర్పణం వదిలిన తెదేపా నేతలు

By

Published : Aug 2, 2020, 10:31 AM IST

మూడు రాజధానులకు నిరసనగా అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నా నదిలో తెదేపా నేతలు తర్పణం వదిలారు. రాజధానిని మార్చడం తాము వ్యతిరేకిస్తున్నామని, దానిని నిరసిస్తూ పెన్నా నదిలో వైకాపా ప్రభుత్వానికి తర్పణం వదులుతున్నామని బీసీ సెల్ జిల్లాకన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల ఆత్మఘోష ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని, త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details