అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో పేదల రేషన్ కార్డులను తొలగించడంపై తెదేపా నేతలు నిరసన చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.
'రేషన్ కార్డులు తొలగించడం సమంజసం కాదు'
గుంతకల్లు నియోజకవర్గంలో కొందరి రేషన్ కార్డులను తొలగించడంపై తెదేపా శ్రేణులు నిరసనకు దిగారు. కరోనా వల్ల పేద ప్రజలు బతకడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర తెలిపారు. తొలగించిన కార్డులను మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే జితేంద్ర
రేషన్ కార్డులను తొలగించడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర అన్నారు. కరోనా వల్ల పేద ప్రజలు బతకడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తొలగించిన కార్డులను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ బిల్లులు'
TAGGED:
gunthakallu news