రహదారి విస్తరణ పేరుతో విద్యుత్ మీటర్లు తొలగించడాన్ని నిరసిస్తూ.. అనతంపురం జిల్లా కదిరిలో తెదేపా నేతలు ధర్నా చేశారు. కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రహదారి విస్తరణ పేరుతో నిబంధనలు గాలికొదిలి పేదల ఇళ్లను తొలగించాలనుకోవడం సరికాదని వెంకట ప్రసాద్ అన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా తొలగింపునకు సిద్ధమవడం చట్టవ్యతిరేకమన్నారు.
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బలిపీఠం విషయంలోనూ ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారపార్టీ ఒత్తిడికి లోనై వ్యవహరించారని విమర్శించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని కందికుంట పేర్కొన్నారు.