ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాడి చేసిన వారిని వదిలి.. బాధితులపై హత్యాయత్నం కేసులా?' - జేసీ తాజా వార్తలు

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిని వదిలేసి.. జేసీపై హత్యాయత్నం కేసు నమోదు చేయటాన్ని తెదేపా నేతలు ఖండించారు. దాడిచేసి, మారణాయుధాలతో స్వైర విహారం చేసినా.. పోలీసులు పట్టించుకోరా అని నిలదీశారు.

ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై దాడిచేస్తే పట్టించుకోరా ?
ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై దాడిచేస్తే పట్టించుకోరా ?

By

Published : Dec 26, 2020, 9:24 PM IST

ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి ఇంటిపై దాడి జరిగినా.. మారణాయుధాలతో కొందరు స్వైర విహారం చేసినా.. పోలీసులు పట్టించుకోరా అంటూ తెదేపా నేతలు ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిని వదిలేశారని.. తిరిగి జేసీపై హత్యాయత్నం కేసు నమోదు చేయటం ఏంటని అనంతపురం జిల్లా తెదేపా ఇంఛార్జ్ బీటీ నాయుడు ఆగ్రహించారు. 18 నెలల వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలు నరకం చూస్తున్నారని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు, హత్యాచారాలు, హత్యలు పెచ్చుమీరాయన్నారు. ఇన్ని ఘటనలు చోటుచేసుకున్నాక జగన్​కు సీఎం పదవిలో కొనసాగే అర్హతే లేదని చెప్పారు. దిశాచట్టం ఉద్దేశాన్ని వైకాపా ప్రభుత్వం నీరుగార్చిందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగాక నిందితులపై కేసులు పెట్టడానికే దిశ చట్టం పనికొస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details