ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానాడు 2020 విజయవంతం : కాలవ శ్రీనివాసులు

ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన తెదేపా ఇంటి పండగ మహానాడు విజయవంతమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. లాక్​డౌన్ కారణంగా డిజిటల్​ మహానాడు నిర్వహించారని, అయినా లక్షలాది తెలుగు తమ్ముళ్లు వివిధ మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. మహానాడులో తాను ప్రవేశపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల తీర్మానాన్ని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించిందని పేర్కొన్నారు.

కాల్వ శ్రీనివాసులు
కాల్వ శ్రీనివాసులు

By

Published : May 29, 2020, 7:48 AM IST


రెండు రోజుల పాటు తెదేపా నిర్వహించిన మహానాడు వేడుకలు విజయవంతమైనట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ నెల 27, 28 తేదీలలో కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన మహానాడు వేడుకలు నిర్వహించారు.

మహానాడులో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కాలవ శ్రీనివాసులు తీర్మానం ప్రవేశపెట్టగా తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నాయకులు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. డిజిటల్ మహానాడు ఆలోచన అభినందనీయమని కాలవ అభిప్రాయపడ్డారు. లాక్​డౌన్​ వల్ల వేడుకలు నిర్వహణకు డిజిటల్ ప్లాట్​ఫాం వేదికైందన్నారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు మహానాడు వేడుకలలో పాల్గొన్నారని కాల్వ తెలిపారు.

ఇదీ చదవండి :లోపాలు సరిదిద్దుకుందాం.... యువశక్తితో కదులుదాం...

ABOUT THE AUTHOR

...view details