ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో రైతు సమస్యలపై తెదేపా నిరసన.. తెదేపా నేతల గృహనిర్బంధం - అనంతపురం జిల్లా తాజా వార్తలు

TDP HOUSE ARREST IN ANANTAPUR: అనంతపురం జిల్లా కేంద్రంలో రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలువురు నేతలను పోలీసులు ముందస్తు గృహ నిర్బంధం చేశారు. నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడుతో పాటు పలువురు తెదేపా నేతలను ఇంటి నుంచి కదలనీయకుండా అడ్డుకున్నారు.

TDP HOUSE ARREST IN ANANTAPUR
అనంతపురంలో పలువురు తెదేపా నేతల గృహనిర్బంధం

By

Published : Jun 13, 2022, 11:39 AM IST

అనంతపురంలో పలువురు తెదేపా నేతల గృహనిర్బంధం

TDP HOUSE ARREST IN ANANTAPUR: అనంతపురం జిల్లా కేంద్రంలో రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలువురు నేతలను పోలీసులు ముందస్తు గృహ నిర్బంధం చేశారు. నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడుతో పాటు పలువురు తెదేపా నేతలను ఇంటి నుంచి కదలనీయకుండా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని తన స్వగ్రామం ఎర్రంపల్లిలో గృహ నిర్బంధం చేశారు. రైతు సమస్యలపై నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేకపోవడం దారుణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కనీసం మాట్లాడే స్వేచ్ఛను కూడా పోలీసులు ఇవ్వకపోవడం.. రాక్షస రాజ్యాన్ని తలపిస్తోందని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కడికక్కడ చెక్​పోస్ట్​లు..:రైతు సమస్యలపై అనంతపురం కలెక్టరేట్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తలపెట్టగా....పోలీసులు ఆ పార్టీ నాయకులను ముందుస్తు అరెస్టులు చేశారు. నిరసన కార్యక్రమానికి శింగనమల నియోజకవర్గంలోని నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, శింగనమల మండలాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు తరలివెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. నార్పల క్రాసింగ్ సమీపంలో, బుక్కరాయసముద్రం ముసలమ్మ కట్ట వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details