అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా శ్రేణులు కాగడాల ప్రదర్శన చేపట్టాయి. ప్రభుత్వ లోపాలపై గళంవిప్పే వారిపై జగన్ సర్కార్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కాగడాల ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని 42వ జాతీయరహదారిపై జ్యోతిరావు ఫూలే విగ్రహం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు కాగడాల ప్రదర్శన చేపట్టి, విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. అరెస్టు చేసిన తెదేపా నేతలను పరామర్శించేందుకు వెళ్తున్న చంద్రబాబునాయుడు, లోకేశ్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
'జగన్ సర్కార్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
మాజీమంత్రి అచ్చెన్నాయుడు, మాజీ శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వ లోపాలపై గళం విప్పే వారిపై జగన్ సర్కార్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తెదేపా శ్రేణుల నిరసన