ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పట్ల అధికార వైకాపా నాయకులు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లిలో సమావేశమైన తెదేపా నాయకులు... ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువత పట్ల నాయకులు సాగించిన దౌర్జన్యాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి' - concern in ananthapuram district
అనంతపురం జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో తెదేపా నేతలు సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కుమ్మరవాండ్లపల్లిలో తెదేపా నేతల సమావేశం