జగన్ పాలన చేపట్టి 100రోజులు కావస్తున్నా... ఇసుక వ్యవహారంపై ఇంకా ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక సరఫరా చేసి వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి విషయంలోనూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఇసుక విధానం అస్తవ్యస్థం... అన్నింట్లోనూ ప్రభుత్వం విఫలం... - jagan
ఇసుక విధానంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకొని... కార్మికులను ఆదుకోవాలని కళ్యాణదుర్గం తెదేపా ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉమామహేశ్వరనాయుడు