TDP Leaders Continues Relay Hunger Strikes Against Chandrababu Arrest :మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడకుకు మద్దతుగా అనంతపురంలో టీడీపీ, సీపీఐ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎస్సీ సెల్ నాయకుడు హనుమంత రాయుడు అర గుండు గీయించుకుని చంద్రబాబు నాయుడు అరెస్టుపై (Chandrababu Naidu Arrest)నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో రిలే నిరహారదీక్షల్లో ఆ పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. నంద్యాలలో చేపట్టిన దీక్షల్లో ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
TDP Cadres Stage Relay Hunger Strikes :సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో రిలే నిరహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. మడకశిర నుంచి చందకచర్ల వరకు 15 కిలోమీటర్ల మేర టీడీపీ నేత తిప్పేస్వామి పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనుమతి లేదంటూ పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంతో పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
Protests Continues Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన నిరసన జ్వాలలు.. యాగాలు, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
TDP Agitations on CBN Arrest in AP :నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. వరికుంటపాడు మండలం కాకోళ్లువారిపల్లెలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
State Wide Protest Against Chandrababu Arrest :పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం గోగులపాడులో చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ప్రత్యేక యాగం నిర్వహించారు. తొలుత గ్రామంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడలో అర్ధనగ్నంగా భిక్షాటన చేస్తూ టీఎన్టీయూసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
TDP Leaders Continues Relay Hunger Strikes Against Chandrababu Arrest: "చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలి"..కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పార్టీ నాయకులతో కలిసి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటకు రావాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలో టీడీపీ నేత నాగం వెంకటపతి మోకాళ్లపై వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని మొక్కు చెల్లించారు.
విజయనగరం జిల్లా రాజాంలో టీటీడీ నేత కోండ్రు మురళీమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనే రీతిలో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం కింతాడలో టీడీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. అనకాపల్లిలో దివ్యాంగులు ట్రైసైకిళ్లతో ర్యాలీ నిర్వహించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు.
Statewide Protest Against Chandrababu arrest రాష్ట్రవ్యాప్తంగా ఉధృతరూపం దాల్చుతున్న నిరసనలు.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఊరువాడ ఆందోళనలు