స్థానిక ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేసిన తెదేపా అభ్యర్థులకు రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్, సీపీఐ జగదీష్ అనంతపురం ఎస్పీని కోరారు. కుట్రపూరితంగా ఎన్నికలు ఏకపక్షం చేసుకోవాలనే ఆలోచనలతో వైకాపా నాయకులు దౌర్జన్యకాండ సృష్టించారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. పోలీసులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలు చోట్ల తెదేపా నాయకులపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన ఇలాంటి అంశాలను ఎస్పీ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
'తెదేపా అభ్యర్థులకు రక్షణ కల్పించాలి' - latest news on local body elections
అనంతపురం జిల్లాలో తెదేపా నాయకులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన తెదేపా అభ్యర్థులకు రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని కోరారు.
అనంతపురం ఎస్పీకి తెదేపా నాయకుల ఫిర్యాదు