ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా అభ్యర్థులను వైకాపా నేతలు బెదిస్తున్నారు' - అనంతంపురం జిల్లా తాజా వార్తలు

మున్సిపల్ ఎన్నికల్లో వార్డులను ఏకగ్రీవం చేయాలని వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అనంతపురం పార్లమెంటు తెదేపా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబుకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.

tdp leaders complaint to Anantapur sp
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను వైకాపా నేతలు బెదిస్తున్నారు

By

Published : Feb 26, 2021, 8:47 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అనంతపురం జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెదేపా నేతలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరి, పార్థసారథి ఉమ్మడిగా ఎస్పీ సత్యయేసుబాబుకు ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మున్సిపల్ వార్డులను ఏకగ్రీవం చేయాలని తెదేపా అభ్యర్థులను వైకాపా నేతలు బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. డివిజన్లలో వైకాపా అభ్యర్థులు గెలవకపోతే వాలంటీర్లను తొలగిస్తామని స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు ప్రభాకర్ చౌదరి చెప్పారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు కాలవ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చూడండి:మున్సిపల్​ ఎన్నికలపై మార్చి ఒకటిన ఎస్​ఈసీ అఖిలపక్ష సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details