ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలగిస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారు' - అనంతపురం వైకాపా నేతల దాడులు

వైకాపా నేతలు తమ కార్యకర్తలు, అనుచరులపై దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేతలు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఓటర్లను బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp leaders complaint on ysrcp leaders at anantapur district
అనంతపురంలో తెదేపా నేతలపై దాడి

By

Published : Feb 2, 2021, 11:22 AM IST

తమ పార్టీ అభ్యర్థులపై అధికార పార్టీ నేతల బెదిరింపులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని తెదేపా నేతలు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబుకు ఫిర్యాదు చేశారు. రోజురోజుకూ వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని మండిపడ్డారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తగిన భద్రత ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు.

సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలగిస్తామని గ్రామాల్లోని ఓటర్లను వైకాపా నేతలు బెదిరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెదేపా నేతలు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details