ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP leaders Bus yatra: వైసీపీ అనకొండల అడ్డగోలు తవ్వకాలు.. రూపురేఖలు కోల్పోయిన మరో కొండ - రాప్తాడు నియోజకవర్గం వైసీపీ

TDP Bus yatra: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఏకరవు పెట్టారు. వైసీపీ నాయకులు మట్టి కొండను తవ్వేసి ఎర్రమట్టిని తరలించటంతో గుట్ట ఆనవాళ్లు లేకుండా పోయిందని ఆరోపించారు. కనగానపల్లి మండలం సోమరవాండ్ల పల్లిలో కృష్ణా జలాలను నిల్వ కోసం ప్రతిపాదించిన రెండు జలాశయాలకు సీఎం జగన్ రెండు సార్లు భూమి పూజ చేసినా పనులు జరగలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 27, 2023, 4:06 PM IST

TDP leaders Bus yatra in Anantapur: సామాన్యులు ఒక ట్రాక్టరు మట్టి సొంత అవసరాలకు తరలిస్తే కేసులు పెడతారు.. కానీ, వైసీపీ నాయకులు ఓ కొండనే పిండి చేసినా పట్టించుకోరు.. మట్టి మాఫియా అరాచకానికి అనంతపురం జిల్లా గొందిరెడ్డిపల్లి పరిధిలోని గుట్ట గుల్లైంది. గుట్టకు గుండుకొట్టేసి.. టిప్పర్లకు టిప్పర్లు ఎర్రమట్టిని ప్రైవేటు లేఔట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

వైసీపీ అనకొండల అడ్డగోలు తవ్వకాలకు రూపురేఖలు కోల్పోయిన మరో కొండ.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి పరిధిలోని గుట్ట గుల్లగుల్లైంది. ఈ గుట్టపై ఎర్ర మట్టి ఉంది. స్థానిక వైసీపీ నాయకుడొకరు.. దీన్ని తన వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకున్నారు. పొక్లెయిన్లతో మట్టి తవ్వేస్తూ... గుట్టకు గుండు కొట్టేస్తున్నారు. రోజూ వందలాది టిప్పర్లను ప్రైవేట్‌ లేఅవుట్లకు విక్రయిస్తున్నారు. ఇలా కొన్ని నెలలుగా అక్రమ తవ్వకాలు చేస్తుండడంతో.. పెద్ద గుట్ట కాస్తా కరిగిపోయింది. ఒకప్పుడు దూరం నుంచి చూసినా కనిపించే గుట్ట ఇప్పుడు దగ్గరకొచ్చి చూస్తేగానీ ఆనవాళ్లు కానరాని పరిస్థితి నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా.. స్పందన లేదని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అవినీతిపై పరిటాల సునీత, శ్రీరామ్‌ సెల్ఫీ ఛాలెంజ్‌

ఇప్పటికే రూపురేఖలు కోల్పోయిన ఈ గుట్ట తవ్వకాలు కొనసాగిస్తే మరికొన్ని రోజులకు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో అనంతపురం జిల్లాలోని గొందిరెడ్డిపల్లి గుట్టను తెలుగుదేశం నాయకులు సందర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరులు వాటాలు వేసుకుని ప్రకృతిని దోచుకుంటున్నారని ఆరోపించారు. మట్టి తరలించడమేగాక.. అందులో మామిడి చెట్లు పెంచినట్లు చూపి.. ఉపాధి నిధులు దోచుకున్నారని దుయ్యబట్టారు. అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకునే ధైర్యం అధికారులకు ఉందా అంటూ.... పరిటాల సునీత, శ్రీరామ్‌ సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.

'గత ప్రభుత్వంలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు జలాశయం వరకు రూ.806 కోట్ల వ్యయంతో కృష్ణా జలాలను తరలించే కాలువ మంజూరు చేశారు. దాదాపు 56 కిలోమీటర్ల దూరం తవ్వే ఈ కాలువపై మధ్యలో సోమరవాండ్ల పల్లి, పుట్టకనుమల వద్ద రెండు జలాశయాలను నిర్మించి కృష్ణా జలాలను నిల్వ చేయాలని ప్రణాళిక చేశారు. ఈలోపు 2019లో ఎన్నికలు రావటంతో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం రాగానే కాలువ, ప్రాజక్టు నిర్మాణ పనులు నిలిపివేశారు. కేవలం 40 కోట్ల వ్యయంతో 1.70 టీఎంసీల నీటిని నిల్వచేయగలిగే తక్కువ ఖర్చుతో నిర్మించే ఈ ప్రాజక్టు పనులు నాలుగేళ్లలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ ప్రాజక్టు కోసం రైతులు దాదాపు 600 ఎకరాల భూమిని ఇచ్చారు. సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు భూమిపూజ చేశారు. భూ సేకరణతో రైతులకు పరిహారం కూడా చెల్లించలేదు. గొప్పలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోమరవాండ్ల పల్లి పనులు ఎందుకు చేయించలేకపోయారో చెప్పాలి.'- టీడీపీ నేతలు

ABOUT THE AUTHOR

...view details