మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా నాయకులు అనంతపురంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన తెదేపా నాయకులు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు పెద్ద ఎత్తున టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని నాయకులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా వారు ససేమీరా అనడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయకుడు, శింగనమల నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జ్ బండారు శ్రావణి, మాజీ మేయర్ స్వరూపతో పాటు ఇతర ముఖ్యనేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, మహిళలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపా నాయకులు సంబరాలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తారు కానీ... తెదేపా నాయకులు నిరసన చెప్పేందుకు ఇవ్వరా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురంలో తెదేపా నేతలు అరెస్ట్... - అనంతపురంలో తెదేపా నేతలు అరెస్ట్...
అసెంబ్లీలో ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటించడంతో...రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం జిల్లాలో తెదేపా నాయకులు చేపట్టిన ఆందోళనల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో..పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురంలో తెదేపా నేతలు అరెస్ట్