ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎస్పీ ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు: జేసీ ప్రభాకర్ రెడ్డి - డీఎస్పీ చైతన్య పై ప్రభాకర్ రెడ్డి విమర్శలు

Allegation on dsp chaitanya : తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కమలమ్మను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. డీఎస్పీ రాసలీలలు బయటపెడతానన్న భయంతోనే.. తనను అరెస్ట్ చేశారని కమలమ్మ ఆరోపించారు. ఆమె అరెస్టును తీవ్రంగా ఖండించిన తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎస్పీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

jc
jc

By

Published : Dec 9, 2022, 9:00 PM IST

Allegation on DSP Chaitanya : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కమలమ్మను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. పాత కేసుల విషయంలో కమలమ్మను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతపురం జిల్లా కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ ను తిరస్కరించారు. గత వారంలో జేసీ అస్మిత్ రెడ్డి పర్యటన సందర్భంగా వైకాపా, తెదేపా నేతల రాళ్ల దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో కమలమ్మపై కేసు నమోదైంది. దీంతో ఆమెను మళ్లీ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

డీఎస్పీపై ఆరోపణలు : డీఎస్పీ రాసలీలలు బయటపెడతానన్న భయంతోనే తనను అరెస్ట్ చేశారని కమలమ్మ ఆరోపించారు. హోంగార్డులతో సహా ఎంతో మంది మహిళలను డీఎస్పీ వేధించారని ఆమె ఆరోపించారు. కమలమ్మ అరెస్టును తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. డీఎస్పీ చైతన్య స్థానిక వైకాపా ఎమ్మెల్యేకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీ ఎమ్మెల్యే చెప్పినట్టు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హీరో కాదు.. జీరో అంటూ విమర్శించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details