ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి' - సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన వార్తలు

సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐ,హెడ్​ కానిస్టేబుల్​ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలంటూ తెదేపా నేతలు కదిరిలో ఆందోళన చేపట్టారు.

tdp leaders agitation in kadiri
కదిరిలో తెదేపా శ్రేణులు ఆందోళన

By

Published : Nov 10, 2020, 5:22 PM IST

చేయని తప్పుకు కుటుంబంతో సహా ఆటో డ్రైవర్ బలవన్మరణానికి కారణమైన సర్కిల్ ఇన్​స్పెక్టర్​, హెడ్ కానిస్టేబుల్​ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి 42పై కదిరి పట్టణంలోని ఇందిరాగాంధీ కూడలిలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ కొరవడిందన్నారు. నంద్యాలలో పోలీసుల వేధింపులు తాళలేక కుటుంబంతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడటం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని నాయకులు విమర్శించారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details