ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వేరుశనగ రైతులకు పరిహారమివ్వాలి' - ఉమామహేశ్వర నాయుడు తాజా వార్తలు

వేరుశనగ రైతులకు పరిహారంగా ప్రభుత్వం ఎకరాకు రూ. 25వేలు ఇవ్వాలని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదెేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

umamaheswara naidu
రైతులతో మాట్లాడుతున్న ఉమామహేశ్వర నాయుడు

By

Published : Oct 19, 2020, 6:57 PM IST

ఈ ఖరీఫ్ సీజన్​లో వాతావరణం అనుకూలించక పూర్తిగా నష్టపోయిన అనంతపురం జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం మండలంలో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ ఆవేదనను ఆయనకు చెప్పారు. ఎంతో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు వర్షాలతో నాశనమయ్యాయని వాపోయారు. ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ.. నష్టపోయిన అన్నదాతలందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. వేరుశనగ రైతులకు ఎకరాకు రూ. 25వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details