గుంటూరు జిల్లాలో రైతుల అరెస్టుకు నిరసనగా జైల్ భరో కార్యక్రమానికి అమరావతికి బయల్దేరిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని పోలీసులు పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. శనివారం పుట్టపర్తి నుంచి అమరావతికి బయల్దేరిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని, ఆయన అనుచరులను పోలీసులు కార్యాలయంలోనే కట్టడిచేసి నిర్బంధించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వేధింపులు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోనే అమరావతి ప్రత్యేక గుర్తింపు వస్తుందని భయంతోనే జగన్ మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు.
అన్నదాతను కన్నీరుపెట్టిస్తే.. పుట్టగతులుండవు; పల్లె రఘునాథ్ రెడ్డి - అనంతపురంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వార్తలు
జైల్భరో కార్యక్రమానికి అమరావతికి బయల్దేరిన తెదేపా నేత పల్లె రఘునాథ్ రెడ్డిని పోలీసులు పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అమరావతి రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు తరలించడంపై ఆయన మండిపడ్డారు.
అమరావతి అన్నదాతలు స్వచ్ఛందంగా 36 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి అన్నదాతలకు సంకెళ్ళు వేసి జైలుకు తరలించడం బాధాకరమన్నారు. అన్నదాతలను కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోయిందన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు 50 మంది ఆత్మహత్య చేసుకున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అమరావతి రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు తరలించడం బాధాకరమన్నారు.