ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హామీ ఇచ్చిన ప్రకారం మద్యం షాపులు మూసివేయాలి' - కళ్యాణదుర్గంలో వైన్ షాపుల తాజా న్యూస్

మద్యం దుకాణాలను తెరిచి కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలు తెవవడం అవసరమా అని ప్రశ్నించారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ ప్రెస్​మీట్​
కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ ప్రెస్​మీట్​

By

Published : May 10, 2020, 2:03 PM IST

రాష్ట్రంలో మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కరోనా పట్ల ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ఆయన పేర్కొన్నారు.

మద్యం దుకాణాలు తెరిచి కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. తక్షణమే మద్యం అమ్మకాలు ఆపేయాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details