ECI Meeting on RVMs: అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే రిమోట్ ఓటింగ్ యంత్రాలు వినియోగించాలని తెలుగుదేశం పార్టీ సూచించింది. ప్రతి రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించి.. అన్ని రాజకీయ పార్టీల అనుమానాలు నివృత్తి చేసి.. ఆ తర్వాత అమలు చేయాలని కోరింది. రిమోట్ ఓటింగ్ యంత్రాల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ఈమేరకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈసీఐ మీటింగ్‌కి హాజరైన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ - ఢిల్లీ ఈసీ సమావేశంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్
ECI Meeting on RVMs: రిమోట్ ఓటింగ్ యంత్రాలపై ఉన్న అనుమానాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి సమగ్ర నిర్ణయం తీసుకోవలని సూచించామని తెలిపారు. రిమోట్ ఓటింగ్ యంత్రాలపై జరిపిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ చర్యలను అన్ని పార్టీలు సమర్ధించినా... ఆర్‌వీఎంల వినియోగంపై అనుమానాలు ఉన్నాయని, వలస కూలీలు ఎంత మంది ఉన్నారనేదానికి శాస్త్రీయ ఆధారాలు బయటపెట్టాలని కోరినట్లు భేటీ అనంతరం పయ్యావుల కేశవ్ తెలిపారు. 30 శాతం మంది ఓటింగ్ రావడం లేదని ఈసీ చెప్పిందని... ఓటింగ్‌కి రాని వారిలో... ఉద్యోగులు, చదువుకున్న వారు, ఖరీదైన కాలనీల్లో ఉండి రాని వారు ఎంత మంది, వలస కూలీలు ఎంతమంది అనే దానిపై శాస్త్రీయ సర్వే చేశారా అని ప్రశ్నించగా... ఈసి నుంచి ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు.
ఇవీ చదవండి: