వాలంటీర్ వ్యవస్థను వైకాపా శ్రేణులు ఎన్నికలకు వాడుకున్నాయని ధర్మవరం తెదేపా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ధర్మవరం తెదేపా పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను తొలగిస్తామని వైకాపా బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాల్ని స్ఫూర్తిగా తీసుకుని.. మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
'పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు పాల్పడింది' - వైకాపాపై పరిటాల శ్రీరామ్ ఫైర్
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు పాల్పడిందని తెదేపా నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులతో ధర్మవరం తెదేపా పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు పాల్పడింది: పరిటాల శ్రీరామ్