ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార పార్టీ ఒత్తిళ్లతో మమ్మల్ని అడ్డుకోవడం సరికాదు - పరిటాల శ్రీరామ్ - Paritala Sriram fired on police

Paritala Sriram fired on police: అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని తెలుగుదేశం నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

TDP leader Paritala Sriram
TDP leader Paritala Sriram

By

Published : May 3, 2022, 3:47 PM IST

అధికార పార్టీ ఒత్తిళ్లతో మమ్మల్ని అడ్డుకోవడం సరికాదు - పరిటాల శ్రీరామ్

Paritala Sriram fired on police: అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని తెలుగుదేశం నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి నూతన గృహ ప్రవేశానికి శ్రీరామ్ వెళుతుండగా పోలీసులు అడ్డగించారు. నాలుగు వాహనాలకు మించి అనుమతి లేదని చెప్పారు. ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. వైకాపా ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అనుచరులతో తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు. పోలీసుల తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి అన్నింటికీ ఆటంకాలు కల్పిస్తున్న వైకాపా ఎమ్మెల్యేపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని శ్రీరామ్ హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details