అనంతపురం జిల్లాలో పాత కక్షలు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనంతో ఢీకొట్టిన దుండగులు... వేట కొడవళ్లతో నరికి చంపారు.
దారుణ హత్య
By
Published : Mar 9, 2019, 9:56 PM IST
అనంతపురం జిల్లాలో దారుణం
తెదేపాలో చురుకైన కార్యకర్తగా మెలుగుతున్న వ్యక్తి గుట్టల్లో శవమై కనిపించాడు. అనంతపురం జిల్లాలో ఈ దారుణ హత్య జరిగింది. తలుపుల మండలం గజ్జలప్పగారిపల్లికి చెందిన వెంకటరమణపై దుండగులు దాడి చేసి చంపేశారు. మృతుడు పరిసర గ్రామాల్లో ట్యాంకర్లతో మంచినీరు సరాఫరా చేసేవాడు. అంగన్వాడీ భవననిర్మాణ విషయంలో గ్రామంలోని ఒక వర్గంతో కొన్నాళ్ల క్రితం వెంకటరమణకుఘర్షణ జరిగింది. ఆ గొడవే ఇలా ప్రాణాల్ని బలితీసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. పని నిమిత్తం వేరే ఊరెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగొస్తున్న వెంకటరమణను చంపేశారని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.