ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదవులు ఒకరికి... పండుగలేమో బీసీల పేరా?: తెదేపా - ap government

వందల సంఖ్యలో పదవులేమో ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి.. పండుగలు బీసీల పేరునా నిర్వహించడం తగదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెస్ రాజు అధికార వైకాపాపై మండిపడ్డారు. గొప్పలు చెప్పడం వైకాపాకే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. బీసీల పేరిట సంక్రాంతి పండగ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

tdp leader ms raju
తెదేపా నాయకులు ఎమ్మెస్​ రాజు

By

Published : Dec 18, 2020, 2:48 PM IST

ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి వందల సంఖ్యలో ఒకే సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టి.. నేడు బీసీల సంక్రాంతి అంటూ గొప్పలు చెప్పడం వైకాపాకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెస్ రాజు విమర్శించారు. అలంకార ప్రాయమైన కార్పొరేషన్ పదవులన్నీ బీసీలకు అంటగట్టి.. బీసీల పేరిట సంక్రాంతి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కదిరిలో రాజు మాట్లాడిన ఆయన.. ఆంధ్రుల రాజధానిగా అమరావతి కొనసాగించాలని సూచించారు.

రాజధాని కోసం భూములిచ్చిన అన్నదాతలు సంవత్సర కాలంగా నిరసనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. అలంకార ప్రాయమైన కార్పొరేషన్ పదవులను అంటగట్టి బీసీల సంక్రాంతి అంటూ గొప్పలు చెప్పడం వైకాపా కే ఆయన విమర్శించారు. వందలకు పైగా పదవులను రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించిన జగన్మోహన్ రెడ్డి.. వీటిపై ఎందుకు ప్రచారం చేయలేదో తెలియజేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 528 లీటర్ల నాటు సారా ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details