రాష్ట్రవ్యాప్తంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ లు పాల్గొన్నారు. రక్తదానం చేసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.
'తెదేపా రాజకీయాలతో పాటు సామాజిక సేవలో ముందుంటుంది' - ఆనంతపురం జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో జరిగిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరయ్యారు.
కాల్వ శ్రీనివాసులు
తెదేపా రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించిందన్నారు. మారుమూల ప్రాంతమైన కనేకల్ మండల కేంద్రంలో దాదాపు 301 మంది యువత రక్తదానం ఇచ్చేందుకు ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: