అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 6,8 వార్డుల్లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబోయే ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎనిమిదో వార్డులో రాయదుర్గం మున్సిపల్ మాజీఛైర్మన్ ముదిగల్లు జ్యోతి తరఫున, ఆరో వార్డులో పురుషోత్తం తరఫున ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పట్టణాభివృద్ధి కోసం తెదేపాకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
రాయదుర్గంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం - municipal elections in ananthapuram district
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా తరఫున మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి కోసం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు