అనంతపురం జిల్లా రైతులకు వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని అఖిలపక్ష పార్టీలు ఆరోపించాయి. నగరంలోని సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి తెదేపా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే... ప్రభుత్వం మాత్రం పథకాల పేరిట కాలయాపన చేస్తోందని కాలువ శ్రీనివాసులు విమర్శించారు.
'రైతులకు వైకాపా సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోంది' - ananthapuram latest news
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా వైకాపా నేతలకు నష్టపరిహారం ఇస్తున్నారని తెదేపా నేత కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురంలో అఖిలపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా వైకాపా నేతలకు నష్టపరిహారం చెల్లించారని మండిపడ్డారు. సోమ, మంగళ, బుధ వారాల్లో జిల్లాలో ఉన్న అన్ని సచివాలయాలకు వినతి పత్రం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి.