అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 19వ వార్డులో తెదేపా అభ్యర్థి గణిగెర నాగమ్మ తరఫున తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యారో సభ్యుడు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
'రాయదుర్గంలో తెదేపా అధిక మెజారిటీతో విజయం సాధిస్తుంది'
పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో పార్టీల ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. పట్టణాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యారో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
వైకాపాకు ఓటు వేయకపోతే పెన్షన్లు, అమ్మ వడి, ఆసరా పథకాలను తొలగిస్తామని ఆ పార్టీ నేతలు ప్రజలను బెదిరిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాయదుర్గం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అద్భుత మెజారిటీతో విజయం సాధిస్తుందని కాల్వ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.