వైఎస్ వివేకా హత్య కేసులో ఒక్కొక్కటిగా డొంక కదులుతోందని తెదేపా నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ నేపథ్యంలో కొత్తమలుపులు చూస్తున్నామన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా.. సొంత చిన్నాన్న విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని కాలువ ప్రశ్నించారు. వివేక కేసులో కొంతమంది తప్పుడు సాక్షాలు ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఈమేరకు అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
'సొంత చిన్నాన్న విషయంలో సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదు'
Kalava Srinivas on Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా.. సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ విచారణ నేపథ్యంలో కొత్తమలుపులు చూస్తున్నామన్నారు.
గతంలో తెదేపా నాయకుడు చంద్రబాబు, లోకేశ్‌పై ఆరోపణలు చేశారు. ఇరువురిని ఈ హత్య కేసులో ఇరికించేందుకు అనేక కుట్రలు చేశారని కాలవ పేర్కొన్నారు. ఇప్పుడు వివేక కుటుంబ సభ్యులే రూ. 40 కోట్లు సుఫారీతో హత్య చేయించినట్లు తెలుస్తోందన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ హామీతోనే హత్య జరిగి ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై సీఎం జగన్ స్పందించాలన్నారు. ఈ సమావేశంలో కాలవతోపాటు హిందూపురం తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:YS Viveka Murder Case: సీబీఐ వాంగ్మూలంలో వివేకా కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు