అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురంలో తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాలవ... వైకాపా పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను ఎక్కడికక్కడ వైకాపా నాయకులు, కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను వేధిస్తే చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా... ఒక్క వైకాపా నాయకుడు రైతులను పట్టించుకోలోదేని దుయ్యబట్టారు. వైకాపా పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది: కాలవ శ్రీనివాసులు - Kalava Srinivasulu latest news
వైకాపా ప్రభుత్వంపై అనంతపురం తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల భూములను ఎక్కడికక్కడ వైకాపా నాయకులు, కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
Kalava Srinivasulu