రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక దందాపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాయదుర్గంలో మాట్లాడిన ఆయన... డీజీపీతో పాటు జిల్లా కలెక్టర్ కు తనని లేఖ రాయాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కోరటం హాస్యాస్పదంగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నది ఎవరో గుర్తించుకోవాలని హితవు పలికారు. అయినప్పటికీ కాపు రామచంద్రారెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు. నిస్పక్షపాతంగా వ్యవహారించే అధికారిని నియమిస్తే ఇసుక దోపిడీ అక్రమాలపై తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తామన్నారు. ఏడాదిన్నర కాలంలో అక్రమంగా ఇసుక తరలించి రామచంద్రారెడ్డి కోట్ల రూపాయలను గడించారని ఆరోపించారు.
ఇసుక దందాపై విచారణ చేపట్టాలి: కాల్వ శ్రీనివాసులు - ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తాజా వార్తలు
రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇసుక దందాకు పాల్పడుతూ కోట్ల రూపాయలను ఆర్జించారని ఆరోపించారు.
tdp leader kalava srinivasulu