అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గలోని ఇనుప ఖనిజాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంలో అంతర్యమేంటని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన గనులను టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనంతపురంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన ఖనిజ గనిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే కొంత ప్రభుత్వ సంపదను వైకాపా నాయకులు దోచుకున్నరని.. ఇప్పడు రాయదుర్గంలోని ఖనిజాన్ని సైతం దక్కించుకోవాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు పిలిచేలా చేశారని ఆరోపించారు.