కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణంలోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో 12 గంటల నిరాహార దీక్ష చేశారు. కేంద్రం ఇస్తున్న కరోనా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తూ తన ఖాతాలోకి వేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని కోరారు. అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం' - kalyanadurgam news today
కొవిడ్-19 విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు 12 గంటల నిరాహార దీక్ష చేశారు. కరోనా వ్యాప్తి నివారణపై ప్రభుత్వం తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు